Syed Sohel On Mr Pregnant Movie: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది

17 Aug, 2023 17:14 IST|Sakshi

‘నేను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేది.  స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే  వర్కవుట్ అవుతుంది. వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ నాలాంటి యంగ్  హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త  ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను’ యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ అన్నారు. . ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. రేపు(ఆగస్ట్‌ 18)ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోహైల్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్. ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనిద్దరం కొత్తవాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనేవాడు. నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. 

 మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్. మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించాను. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఆయన మంచి సూచనలు ఇచ్చేవారు. అలా ఈ క్యారెక్టర్ బాగా చేశాను. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ ధరించాను. ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది. తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు.

 ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.

 ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నన్ను ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నా.  ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది. కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుంది.

 మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.

ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు షూటింగ్ జరుగుతోంది. కథ వేరే ఉంటది అనే మరో సినిమా చేస్తున్నాను. సెలెక్టెడ్ గా మూవీస్ చేయాలని ఉంది. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది.

మరిన్ని వార్తలు