గ్రహాంతర తాప్సీ!

25 Jun, 2021 04:28 IST|Sakshi

కిక్‌ ఇచ్చే కాన్సెప్ట్‌ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్‌ ఇచ్చే కాన్సెప్ట్‌ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్‌ నీలకంఠన్‌. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్‌. తాజాగా ఆయన ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్‌ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్‌ సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్‌ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్‌ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్‌ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు