ఆ అమ్మాయిఎక్కడ?

23 Feb, 2021 07:53 IST|Sakshi

ఓ అమ్మాయి కోసం వెతికే పనిలో ప్రతీక్‌ గాంధీతో కలిసి ప్రయాణం చేయనున్నారు తాప్సీ. ‘వో లడ్కీ హై కహాన్‌ ’ సినిమా కోసమే ఈ ప్రయాణం. తాప్సీ నటించనున్న ఈ తాజా చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఇది ఇన్వెస్టిగేటివ్‌ కామెడీ సినిమా.

ప్రతీక్‌ గాంధీ అహంభావి పాత్రలో నటించనుండగా, పోలీసాఫీసర్‌ పాత్రను తాప్సీ చేయనున్నారు. అభిప్రాయాలు కలవని ఈ ఇద్దరూ కనబడని ఒక అమ్మాయిని వెతికే ప్రయత్నంలో చేసే పనులు కామెడీగా ఉంటాయట. ‘‘అర్షద్‌ చెప్పిన ఈ కథ వినగానే నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అంత బాగుంది’’ అన్నారు చిత్రనిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ఆరంభించి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు