గోల్డెన్‌ చాన్స్‌ కొట్టేసిన తాప్సీ

19 Sep, 2021 11:17 IST|Sakshi

కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తారనీ బాలీవుడ్‌లో ఓ వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ వార్త నిజమేనని, షారుక్‌కు జోడీగా తాప్సీ నటించనున్నారనీ బాలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌. చట్టవిరుద్ధంగా అమెరికా, కెనడా వంటి విదేశాలకు వీసాలు సంపాదించే విద్యార్థులు, వ్యక్తుల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సోషల్‌డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని, వచ్చే ఏడాది పంజాబ్‌లో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుందని టాక్‌. తాప్సీ కెరీర్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకుని వెళ్లిన ‘బద్లా’ సినిమాకు షారుక్‌ ఖాన్‌ ప్రొడ్యూసర్‌ అనే సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు