ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ

6 Mar, 2021 13:03 IST|Sakshi
హీరోయిన్‌ తాప్సీ పన్ను (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ

సాక్షి, ముంబై: తన నివాసంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పారు. గత మూడు రోజులుగా వెలుగు చూసిన పరిణామాలపై ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు తన నివాసంలో ఏం సోదా చేశారో వెల్లడించారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదన్నారు తాప్సీ. అలానే తాను ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని.. కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ‘నేను ఎవరిపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. వీటిపై తాప్సీ తాజాగా స్పందించారు.  

చదవండి:
అనురాగ్ కశ్యప్‌, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత

మరిన్ని వార్తలు