ఓటీటీలోకి మరో బాలీవుడ్‌ సినిమా

2 Jun, 2021 10:20 IST|Sakshi

కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా సినిమా థియేటర్లకు తాళం పడింది. దీంతో ఓటీటీల డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. సల్మాన్‌ ఖాన్‌ లాంటి పెద్ద హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా మరో బాలీవుడ్‌ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం‘రష్మీ రాకెట్‌’నేరుగా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు ‘రష్మీ రాకెట్‌’ని తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కూడా జరిపారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తాప్సీ గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌గా కనిపించబోతుంది. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కథ విన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు దాటి చిత్రీకరణ పూర్తి చేశామని ఆమె చెప్పింది. ఈ చిత్రంలో తాప్సీ మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు.ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్‌ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్‌ కోసం ఆమె కాస్ట్యూమ్‌ టీమ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.


చదవండి:
OTT: జూన్‌లో రిలీజయ్యే చిత్రాలివే!
4 వారాలు..4 సినిమాలు..క‌ట్టిపడేసే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ

మరిన్ని వార్తలు