కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ

28 Jul, 2020 19:00 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొంటున్నాయి. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే సుశాంత్‌ మరణించాడంటూ కంగనా రనౌత్‌ వ్యాఖ్యల అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఇన్‌సైడర్‌, అవుట్‌ సైడర్‌ అంటూ పరస్పరం నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల కంగనా, హీరోయిన్‌ తాప్సీ పొన్ను, స్వరాభాస్కర్‌లను బీ గ్రేడ్‌ నటీనటులని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో కంగనా వ్యాఖ్యలకు తాప్సీ ఘాటుగా సమాధానం ఇస్తూ కపటత్వం ఉన్న నటి కంగనా అని మండిపడ్డారు. (చదవండి: ‘కరణ్‌‌ జోహార్‌‌ను అభిమానిస్తానని చెప్పలేదు’)

సుశాంత్‌ మరణం సినీ పరిశ్రమలో ఎందుకు యుద్దానికి కారణమైందని, అలాగే కంగనాకు మీకు మధ్య వివాదం ఎలా ముదిరిందని ఓ ఇంటర్యూలో తాప్సీని అడగ్గా.. ‘పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉన్న నటుడు సుశాంత్‌. అర్థంతరంగా తన జీవితాన్ని ఇలా ముగించడం చాలా బాధాకరమైన విషయం. అంతేగాక అతడి మరణాన్ని వాడుకుని కొంత మంది తమ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేయడం మరింతగా బాధించింది. క ఈ వివాదంలో నేను బలవంతంగా రావాల్సి వచ్చింది. కొంత మంది పేర్లను కూడా బయటపెట్టాను. ఆ తర్వాత నా తరపున నేను నిలబడాల్సిన అవసరం ఉందని భావించాను. ఎందుకంటే మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు ఇతరులను కించపరచడం సరైనది కాదు’ అంటూ కంగనాను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా