ఐటీ దాడులపై తాప్సీ ఏమన్నారంటే..

7 Mar, 2021 03:35 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను తన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసిన 3 రోజుల  తర్వా త స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మూడు రోజుల పాటు మూడింటి గురించి అధికారులు గాలించారు. మొదటిది పారిస్‌లో నాకు ఉందని అనుకుంటున్న బంగ్లా తాళాల కోసం గాలించారు. ఎందుకంటే వేసవి సెలవులు దగ్గరకొస్తున్నాయి కదా’’ అని  పేర్కొన్నారు.

‘‘నేను దాచి పెట్టాననుకున్న రూ.5 కోట్ల రసీదు కోసం ఇల్లంతా వెతికారు. నేను ఆ డబ్బు తీసుకోలేదు కాబట్టి రసీదు కూడా దొరకలేదు’’ అని మరో ట్వీట్‌ చేశారు. మూడో ట్వీట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2013లో ఐటీ శాఖ వీరిపైనే దాడులు జరిపితే ఎవరూ ఏమీ అనలేదని, ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిర్మల  ప్రశ్నించారు. దీనిపై తాప్సీ స్పందిస్తూ గౌరవ ఆర్థిక మంత్రి చెబుతున్న ప్రకారం 2013 నాటి దాడుల్ని నా జ్ఞాపకశక్తిని కూడా శోధించారు’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు