బయటకు రానంటున్న టబు

17 Mar, 2021 21:04 IST|Sakshi

బయో బబుల్‌ నుంచి బయటకు రాను అంటున్నారట టబు. కార్తీక్‌ ఆర్యన్, టబు, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భూల్‌ భులైయా 2’. 2007లో వచ్చిన ‘భూల్‌ భులయ్యా’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం కార్తిక్, టబు, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎక్కువ కోవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తున్నారట టబు.

తన వంతు షూటింగ్‌ ఉంటే తప్ప బయో బబుల్‌ నుంచి టబు బయటకు రావడం లేదు. ‘‘టబుగారు తిరిగి సెట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ ఆమె బయో బబుల్‌ నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ సెట్స్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు కార్తీక్‌ ఆర్యన్‌. 2021 నవంబరు 19న ఈ చిత్రం రిలీజ్.

మరిన్ని వార్తలు