సినీ ఎగ్జిబిటర్స్‌ సమస్యలపై భేటి కానున్న మంత్రి తలసాని

10 Aug, 2021 13:57 IST|Sakshi

సినీ ఎగ్జిబిటర్స్‌ సమస్యలపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ భేటి ముగుసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. థియేటర్ల కరెంట్‌ బిల్లులను మాఫి చేయాల్సిందిగా మంత్రిని కోరమన్నారు. విద్యూత్‌ బిల్లుల మాఫీకి ప్రభుత్వం అంగీకరించిందని, మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎగ్జిబిటర్స్‌ పేర్కొన్నారు. 

కాగా ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ చార్జి వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మురళి మోహన్‌, కార్యదర్శి సునీల్‌ నారంగ, సినీ ఎగ్జిబిటర్స్‌ సదానంద్‌ గౌడ్‌, అభిషేక్‌, అనుపమ్‌ రెడ్డి తదితరులు మంత్రిని కలిసి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఎగ్జిబిటర్స్‌ తమ సమస్యలను యంత్రి దృష్టికి తీసుకేళ్లారు. దీంతో ఆయన త్వరలోనే వారి సమస్యలపై ఆయా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు