సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని

17 Sep, 2021 07:32 IST|Sakshi

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని సప్తగిరి తన ప్రతిభతో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. ‘గూడుపుఠాణి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్‌. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడుపుఠాణి’.

పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘గూడుపుఠాణి’ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘మా ఎస్‌ఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మేము ఇప్పుడు సినిమా రంగం వైపు వచ్చాం.

సప్తగిరి కెరీర్‌లో ‘గూడుపుఠాణి’ సినిమా  ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌. ‘‘సూపర్‌స్టార్‌ కృష్ణగారి ‘గూడుపుఠాణి’ టైటిల్‌తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలిసారి థ్రిల్లర్‌ సినిమాలో హీరోగా నటించాను’’ అన్నారు సప్తగిరి. ‘‘నా కథకు మంచి నిర్మాతలు, హీరో దొరకడం నా అదృష్టం’’ అన్నారు కుమార్‌ కె.ఎం. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి, ఆదోని ఎం.ఎల్‌.ఎ. క్రాంతి కుమార్, సంగీత దర్శకుడు ప్రతాప్‌ విద్య తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్‌ చెన్న.  

చదవండి :అలాంటివాళ్లు పోటీకి అర్హులు కాదు
'ఫోటోలు,వీడియోలు తీసినచో సెల్‌ఫోన్‌ పగలగొట్టబడును'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు