ఆల్‌ రౌండర్‌ తమన్నా..

17 Aug, 2021 10:14 IST|Sakshi

సిల్వర్‌ స్క్రీన్, స్మాల్‌ స్క్రీన్, డిజిటల్‌ స్క్రీన్‌లను బ్యాలెన్స్‌ చేస్తూ ఆల్‌ రౌండర్‌ అనిపించుకుంటున్నారు హీరోయిన్‌ తమన్నా. ఆల్రెడీ ‘లెవన్త్‌ అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌ స్క్రీన్‌పై సత్తా చాటిన ఈ బ్యూటీ తాజాగా మరో వెబ్‌ ఫిల్మ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో రితేష్‌ దేశ్‌ముఖ్‌ (హీరోయిన్‌ జెనీలియా భర్త) మరో లీడ్‌ యాక్టర్‌. ఇటీవలే షూటింగ్‌ మొదలైంది. ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’ ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు.

ఇందులో మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధిగా తమన్నా, విడాకులు ఇప్పించే లాయర్‌గా రితేష్‌ కనిపిస్తారని బాలీవుడ్‌ టాక్‌. స్మాల్‌ స్క్రీన్‌ విషయానికొస్తే.. తమన్నా హోస్ట్‌గా చేస్తున్న ‘మాస్టర్‌ చెఫ్‌’ ప్రోగ్రామ్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక సిల్వర్‌ స్క్రీన్‌పై తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’, ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే వరుణ్‌ తేజ్‌ ‘గని’ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు