Trolls On Tamannaah: నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా

10 Aug, 2023 09:21 IST|Sakshi

గ్లామర్‌కు కేరాఫ్‌ మిల్కీబ్యూటీ తమన్న. ఈమె ఇంత కాలం నటిగా నిలబడ్డారంటే అందాలారబోత ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కాగా కథానాయకిగా నటిస్తూనే మరో పక్క ఐటమ్‌ సాంగ్‌లకు సై అంటున్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్‌, తెలుగులో రజనీకాంత్‌తో జైలర్‌ చిత్రాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవుతున్నాయి.

మరో విషయం ఏమిటంటే జైలర్‌ చిత్రంలో తమన్న రజనీకాంత్‌కు ఫెయిర్‌ కాదు. ఇక భోళాశంకర్‌ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్‌కే అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కాగా ఇద్దరు సీనియర్‌ హీరోలతో నటించడం గురించి తమన్నపై నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. సీనియర్‌ నటులతో జత కట్టడానికి ఎందుకు అంగీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు? అవకాశాలు రాకా, లేక డబ్బు కోసమా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.

(ఇదీ చదవండి: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్‌ ఇదేనా?)

దీనికి స్పందించిన తమన్న నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు? నటించే పాత్రలను చూడండి అని ఘాటుగా పేర్కొన్నారు. కాదూ కూడదూ అంటారా వయసు గురించి మాట్లాడాలంటే తాను హలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూస్‌ మాదిరి సాహసాలు చేయగలను, డాన్స్‌ చేయగలను అని పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్‌ నటులతో కలిసి నటించడం తనకు ఎప్పుడూ సంతోషమేనన్నారు.

మరిన్ని వార్తలు