Tamannaah: ‘ఎఫ్‌ 3’ మూవీలోని తమన్నా ఇంట్రెస్టింగ్‌ లుక్‌ వైరల్‌!

26 Nov, 2021 08:05 IST|Sakshi

Tamanna Bhatia Goddess Look Photos: గ్లామర్‌కి చిరునామా అన్నట్లుగా ఉంటారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్లు ఆమెకు ‘గ్లామరస్‌ హీరోయిన్‌’ పేరునే తెచ్చాయి. అలాంటి తమన్నా పూర్తి సంప్రదాయబద్ధంగా.. అది కూడా అమ్మవారిలా దర్శనమిస్తే కచ్చితంగా హాట్‌ టాపిక్‌ అవుతుంది. అమ్మవారిలా అలంకరించుకుని, అరిటాకులో ఇడ్లీ, దోసె ఆరగిస్తున్న ఫొటోలను షేర్‌ చేసింది. దీనికి ‘‘ఇలా అరిటాకులో తింటుంటే నాకు నేను దేవతలా అనిపిస్తున్నాను. అరిటాకు మనకు సులభంగా దొరుకుతుంది. పర్యావరణానికి కూడా మంచిది. మన మూలాలకు వెళ్లినట్లుగా అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

చదవండి: బాలయ్య, నేను తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం : శ్రీకాంత్‌

ఇక తమన్నా ఫొటోలు చూసి, ఆమె అభిమానులు ‘మీరు దేవత, జై మాతా, జై తమన్నా మాతా, అన్నపూర్ణ, మీరు అందరి దేవత’ అని కామెంట్లు పోస్ట్‌ చేశారు. హఠాత్తుగా తమన్నా ఇలా అమ్మవారి గెటప్‌ వేయడానికి కారణం ఏంటంటే... ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’మూవీలో లుక్‌ అని, ఈ గెటప్‌తో వెంకిని తమన్నా ఓ ఆటాడుకునే సన్నివేశమని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫొటో అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లుక్‌ అదుర్స్‌ అని చెప్పొచ్చు.

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

మరిన్ని వార్తలు