తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్‌ యూనిట్‌

20 Jun, 2023 07:30 IST|Sakshi

ఇప్పుడు కోలీవుడ్లో నటి తమన్నా గురించే చర్చ నడుస్తోంది. ఈ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఏమైంది అంటూ పలువురు ఆమెను కార్నర్‌ చేస్తున్నారు. తమన్న గ్లామరస్‌ పాత్రలతోనే నటనను ప్రారంభించారు. ఇంతకుముందు గ్లామరస్‌ పాత్రలో నటించడానికి కొన్ని హద్దులు పెట్టుకున్న ఆమె ఇప్పుడు ఆ ఎల్లలను దాటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు కారణం జీ కర్దా అనే వెబ్‌ సిరీస్‌లో ఆమె శృతిమించిన అర్ధనగ్న దుస్తులతో కూడిన నటనే. ఈ వెబ్‌ సిరీస్‌లో పలు ద్వంద్వ అర్థాలు, అశ్లీల సన్నివేశాలతో పాటు, తమన్నా బెడ్‌ రూమ్‌ శృంగార సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు)

ప్రస్తుతం ఆమె తమిళంలో రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది. దీంతో జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో ఆమె శృతిమించిన అందాల ఆరబోతకు తెరలేపింది. ఆపై విజయ్‌ వర్మతో ప్రేమ వ్యవహారం తెలిసిందే. లస్ట్‌ స్టోరీస్‌- 2లో కూడా మితిమీరిన రొమాన్స్‌ సీన్స్‌ ఉన్నాయి. దీంతో జైలర్‌ చిత్ర యూనిట్‌ షాక్‌కు గురవుతోందని సమాచారం. ఆ ఎఫెక్ట్‌ తమ చిత్రంపై పడుతుందనే ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇకపోతే నటీమణులు డబ్బు కోసం ఎలాగైనా నటించడానికి సిద్ధం అవుతున్నారని, గతంలో కూడా కొందరు హద్దులు మీరి అందాల ఆరబోతను చూశామని, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తున్న నటి తమన్న ఇలాంటి వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం సబబు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

(ఇదీ చదవండి: నాకు ఫ్యామిలీ ఉంది.. అనవసర విషయాల్లోకి లాగొద్దు: అనసూయ)

మరిన్ని వార్తలు