Tamannaah : మిల్కీ బ్యూటీ పనైపోయిందా? ఆశలన్నీ ఆ సినిమాపైనే!

27 Oct, 2021 15:42 IST|Sakshi

తమన్నా.. పరిచయం అక్కర్లేని పేరు. మిల్కీ బ్యూటీగా ఫేమ్ సంపాదించిన క్వీన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టాటస్ సంపాదించిన నటి. సీన్ కట్ చేస్తే... ఇపుడు ఆమె డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు కొన్ని కారణాలను కూడా చూపెడుతున్నారు ఫిలింనగర్ జనం. ఈ మద్యే ఓ టీవీ ఛానల్ లో హోస్ట్ గా నటించేందుకు తమన్నాకు ఆఫర్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా పూర్తయిపోయాయి. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ ప్రొగ్రామ్ నుంచి తమన్నా తప్పుకుంది. 


(చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులు)

తమన్నా చెయ్యాల్సిన హోస్ట్ ప్లేస్‌ని అనుసూయ ఆక్రమించింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో తమన్నాని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఐతే.. మూవీ టీమ్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారన్న వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ భారీ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకుంది అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 

ఈమధ్య తమన్నా నటించిన సీటీమార్, మాస్ట్రో చిత్రాలు కూడా జనాదరణ పొందలేదు. ఐతే.. ఎఫ్ 3తో మళ్లీ తన కెరీర్ పుంజుకుంటుందని ఆశపడుతోంది తమన్నా.  ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తందా శీతాకాలం తో పాటు ఓ హిందీ చిత్రం కూడా ఉంది. సో.. తమన్నా కెరీర్‌పై వస్తోన్న ఈ రూమర్స్ పై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు