వెబ్‌ సిరీస్‌: తమన్నా షాకింగ్‌ రెమ్యునరేషన్!‌

1 Apr, 2021 20:22 IST|Sakshi

మిల్కీబ్యూటి తమన్నా తెలుగులో చివరిసారిగా "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో హీరో మహేశ్‌బాబుతో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది. దానికన్నా ముందు 2019లో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కీలక పాత్ర చేసింది. తెలుగులో పెద్దగా సినిమాలు తగ్గించేసిన ఈ భామ ఈ ఏడాది మాత్రం మొత్తం టాలీవుడ్‌ మీదే ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌ 'సీటీమార్‌', నితిన్‌ 'మాస్ట్రో', సత్యదేవ్‌ 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్‌ 3', 'దటీజ్‌ మహాలక్ష్మి' సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో 'బోలె చుడియాన్‌' చిత్రంలోనూ కనిపించనుంది.

ఇదిలా వుంటే ఈ మధ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మీద కన్నేసిన ఈ భామ లెవంత్‌ అవర్(తెలుగు)‌, నవంబర్‌ స్టోరీ(తమిళం) వెబ్‌సిరీస్‌లో నటించింది. వ్యాపారవేత్త అరత్రిక రెడ్డిగా నటించిన లెవంత్‌ అవర్‌ ఉగాది సందర్భంగా 'ఆహా'లో ఏప్రిల్‌ 9 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు గానూ తమన్నా కోట్లల్లో పారితోషికం తీసుకుంటుందంటూ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీని ప్రకారం ఈ మిల్కీ బ్యూటీ రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ అందుకుందట. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో తమన్నా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తమన్నా డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్న లెవంత్‌ అవర్‌ సిరీస్‌కు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి: తమన్నా‘లెవన్త్‌ అవర్’ టీజర్‌ వచ్చేసింది

లెవంత్‌ అవర్ కథ ఇదే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు