ఫ్లైట్‌లో తమన్నా: అక్కడ కోహ్లి ఏం చేస్తున్నాడు?

11 Apr, 2021 11:56 IST|Sakshi

వెండితెర మీద రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లాక్‌డౌన్‌లో ఓటీటీ మీద కూడా ఓ కన్నేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య తమిళంలో 'నవంబర్‌ స్టోరీ' అనే వెబ్‌సిరీస్‌ చేసిన ఆమె తాజాగా తెలుగులో 'లెవంత్‌ అవర్'‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మధ్యే ఓటీటీలో రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌ పర్వాలేదనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ బ్యూటీ ఇటీవల "బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో తమన్నా చేతిలో బిస్కెట్లు, చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకుని ఉండగా వెనక నుంచి ఇద్దరూ వాటినే తదేకంగా చూస్తున్నారు.

ఈ ఫొటోలో చెంపకు చేయానించుకుని బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్న వ్యక్తి విరాట్‌ కోహ్లి అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. విరాట్‌ అక్కడెందుకున్నాడని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు అతడు మా కింగ్‌ కోహ్లియేనా? కాదా? అంటూ గందరగోళానికి గురయ్యారు. కానీ అక్కడుంది టీమిండియా కెప్టెన్‌ కాదు. ఈమేరకు ఆమె పోస్ట్‌లోనే క్లారిటీ ఇస్తూ వారి పేర్లను ట్యాగ్‌ చేసింది. దీని ప్రకారం హెయిర్‌ డ్రెస్సర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే తనతో ఉన్నారని క్యాప్షన్‌లో చెప్పకనే చెప్పింది. తమన్నా ముంబై నుంచి హైదరాబాద్‌కు చార్టెడ్‌ ఫ్లైట్‌లో వస్తుండగా తీసిన ఈ ఫొటో మొత్తానికి నెట్టింట తెగ హల్‌చల్‌ చేసింది.

కాగా 2012లో తమన్నా, విరాట్‌ ఇద్దరూ ఓ యాడ్‌లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇరువురూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించగా వాటిని వదంతులుగా కొట్టిపారేసింది తమన్నా. యాడ్‌‌ చిత్రీకరణ సమయంలో ఏదో రెండు మాటలు మాట్లాడుకున్నామే తప్ప తర్వాత తాము కలిసిందీ లేదు, మాట్లాడిందీ లేదని స్పష్టం చేసింది. దీంతో వీరి ప్రేమ వదంతులకు చెక్‌ పడింది. ఇదిలా వుంటే తమన్నా నటించిన 'లెవంత్‌ అవర్‌' వెబ్‌ సిరీస్‌ ఆహాలో ప్రసారమవుతోంది. ఇది కాకుండా ఆమె నటించిన ‘సీటీమార్‌’, ‘మాస్ట్రో’, ‘ఎఫ్‌ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

చదవండి:  ‘బాహుబలి’ చేసిన మీరు ఈ వెబ్‌ సిరీస్‌ చేయడం గ్రేట్‌

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి కరోనా నెగెటివ్!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు