బబ్లీ చాన్స్‌ రావడం నా అదృష్టం

18 Sep, 2022 03:56 IST|Sakshi

 – తమన్నా

‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్‌’. స్టార్‌ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్‌ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్‌ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్‌ బండార్కర్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్‌ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్‌ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్‌ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్‌
అనిపించింది’’ అన్నారు మధూర్‌ భండార్కర్‌.

మరిన్ని వార్తలు