‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

14 Dec, 2021 07:58 IST|Sakshi

టీనేజ్‌ లైఫ్‌ చాలామందికి ఓ మధుర జ్ఞాపకంలా ఉంటుంది. జీవితంలో సెటిలయ్యాక తమ కాలేజ్‌ డేస్, యూత్‌ఫుల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆనందపడతారు. అలాంటి సంఘటనల సమాహారంతో సత్యదేవ్, తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్‌ దర్శకత్వంలో భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్‌.ఎస్‌. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సంపత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నవీన్‌ రెడ్డి, రాఘవ సూర్య. 

మరిన్ని వార్తలు