మూడు నెలలుగా కోమాలో ఉన్న నటుడి భార్య మృతి

31 Oct, 2022 20:10 IST|Sakshi

తమిళ నటుడు భరత్‌ కళ్యాణ్‌ భార్య ప్రియదర్శిని (43) కన్నుమూశారు. గత కొన్నివారాలుగా కోమాలో ఉన్న ఆమె సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి డైట్‌ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్‌ స్టార్ట్‌ చేశారు. సడన్‌గా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్‌ లెవల్స్‌ విపరీతంగా పెరిగిపోయాయట. మూడు నెలల క్రితం పరిస్థితి సీరియస్‌ కావడంతో ఆమెను చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లగా తాజాగా మరణించారు.

కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్‌ కుమార్‌ తనయుడే భరత్‌ కల్యాణ్‌. మొదట్లో సినిమాలు చేసిన ఆయన తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. అపూర్వ రంగల్‌, వంశం, జమిలా వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు భరత్‌ కల్యాణ్‌.

చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి
ఇనయను ఆడుకున్న హౌస్‌మేట్స్‌, శ్రీహాన్‌ లాస్ట్‌ పంచ్‌ అదిరింది

మరిన్ని వార్తలు