నటుడు దాముకు అరుదైన గౌరవం

24 Apr, 2021 20:23 IST|Sakshi

తమిళ నటుడు దాముకు రాష్ట్రీయ శిక్ష గౌరవ్‌ పురస్కార్‌ 2021 అవార్డు వరించింది. చదువుకునే రోజుల్లోనే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దాము అనబడే డాక్టర్‌ ఏవీ.దామోదరన్‌ దివంగత దర్శక శిఖరం కె.బాలచందర్‌ శిష్యుడు అన్నది గమనార్హం. చిత్రాల్లో వివిధ రకాల పాత్రలో నటించి నటుడిగా గుర్తింపు పొందిన దాములో విద్యాసేవకుడు ఉన్నారన్నది చాలామందికి తెలియదు. ఆయన దివంగత  రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం శిష్యుడు కూడా. గత 2011లో కోవైలో జరిగిన ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను ఆయన ఎంతగానో ప్రశంసించారని నటుడు దాము తెలిపారు.

ఆ సమయంలో నీ ప్రతిభ విద్యాసేవకు ఉపయోగించాలని అబ్దుల్‌ కలాం సూచించారన్నారు. మరణించి తను దశాబ్ద కాలంగా తాను విద్యా సేవకు కృషి చేశానని చెప్పారు. అందుకు 2011లో అంతర్జాతీయ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అసోసియేషన్‌ ను ప్రారంభించినట్లు చెప్పారు. 2011 నుంచి 2016 వరకు ఐదేళ్లపాటు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పర్యవేక్షణలో విద్యాసేవలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే తాను విద్యాబోధకుడిని కాదని సేవకుడిని మాత్ర మేనని చెప్పారు. దాము విద్యాసేవకుగాను జాతీయ విద్యాభివృద్ధి, పరిశోధన సంస్థ కేంద్రం ఆయన్ని రాష్ట్రీయ శిక్ష గౌరవ్‌ పురస్కార్‌ 2021 అవార్డుతో సత్కరించింది. గురువారం సాయంత్రం జేకే ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ దాముకు చెన్నైలో అభినందన సభను ఏర్పాటుచేసి ఘనంగా సత్కరించింది.

మరిన్ని వార్తలు