కరోనా : సీనియర్ జర్నలిస్టు, నటుడు మృతి

15 Sep, 2020 12:33 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరోనా వైరస్ కారణంగా తమిళ సినీ పరిశ్రమ  మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు ఫ్లోరెంట్ సి పెరారీ( 67) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఒక షూటింగ్ సందర్భంగా కరోనా బారిన పడ్డ ఆయన చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస తీసుకున్నారు. దీంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్భాంతికి గురైంది. పెరారీ ఆకస్మిక మరణంపై దర్శకుడు సీను రామసామితోపాటు, పలువురు సినీ దర్శకులు, ప్రముఖులు, ఇతర నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.  

పెరారీ తొలిసారిగా 2003లో విడుదలైన విజయ్ హీరోగా తెరకెక్కిన పుడియా గీతైలో నటించారు. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన కయాల్ (2014) ఎన్‌కిట్టా మోతాతే (2017) పాత్రలతో ఎంతో పేరు పేరు తెచ్చుకున్నారు. సాత్రియన్ (2017), ధనుష్ సూపర్ హిట్ మూవీ 'వేలై ఇల్లా పట్టదారి' (విఐపి-2) చిత్రాలలో పాటు, రాజా మంతిరి, తోదారి, ముప్పరిమనం, తారామణి, పోధువాగ ఎమ్మనాసు తంగం ఆయన నటించిన ఇతర చిత్రాలు. రామసామి దర్శకత్వంలో నటించిన చిత్రం ఇడామ్ పోరుల్ యెవల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. టెలివిజన్‌లో 20 సంవత్సరాల అనుభవం ఉన్న, పెరారీ కలైంగర్ టీవీకి జీఎంగాను, విన్ టీవీ (సీఈవో), విజయ్ టీవీల వంటి ఛానెళ్లలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

మరిన్ని వార్తలు