మరో విషాదం : ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య

20 Feb, 2021 15:00 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళ టెలివిజన్ పరిశ్రమ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్  ఆత్మహత్య చేసుకున్నారు.  తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక)

చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్‌ అయ్యారు.  అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్‌ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు స్నేహితుల సమాచారం మేరకు కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. 

కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం  ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు