సినీ పరిశ్రమలో మరో విషాదం: నటుడు కన్నుమూత

13 May, 2021 08:06 IST|Sakshi

చెన్నె: తమిళ సినీ పరిశ్రమలో ఆకస్మిక మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రముఖ హాస్య నటుడు నెల్లె శివ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. నెల్లె జిల్లాకు చెందిన ఈయన నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌కు వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినీ రంగానికి వచ్చారు. 1985లో ‘అన్భావం’ సినిమా ద్వారా శివ నటుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 500కు పైగా సినిమాల్లో నెల్లె శివ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

నెల్లె శివ ఆకస్మిక మృతిపై తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు మారన్‌ కూడా కరోనాతో మంగళవారం చెంగల్‌పట్టులో మృతి చెందారు. పలు చిత్రాల్లో ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధంగా వరుస విషాద ఘటనలతో తమిళ సినీ పరిశ్రమ క్రుంగిపోతుంది.

చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత
చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు