తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

12 Apr, 2021 19:05 IST|Sakshi

చెన్నై: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్‌.. నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. ఇతడు 'సాంతిప్పొమ్‌ సింతిప్పొమ్'‌ అనే చిత్రాన్ని నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తను కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లుగా కెరీర్‌ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: ఆ రకంగా చూస్తే ఇది ఇండియాలోనే తొలి చిత్రం!

కొత్త కారులో చక్కర్లు కొట్టిన ప్రభాస్‌ సోదరి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు