ఆ కష్టమేంటో తెలిసొచ్చింది

7 Jul, 2022 15:12 IST|Sakshi

చిత్ర నిర్మాణం ఎంత కష్టమో ఒక నటుడిగా, దర్శక, నిర్మాతగా తెలిసోచ్చిందని సారద్‌ అన్నారు. ఈయన తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై స్వీయ దర్శక నిర్మాణంలో పాటలు రాసి, కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తెర్కత్తి వీరన్‌’. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. దర్శకుడు భాగ్యరాజ్, నిర్మాత, నటుడు కే.రాజన్, గిల్డ్‌ అధ్యక్షుడు జాగ్వర్‌ తంగం, సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు.

చిత్ర దర్శకుడు సారద్‌ మాట్లాడుతూ ఒక యధార్థ సంఘటన ఆధారంగా కమర్శియల్‌ అంశాలతో చిత్రం తెరకెక్కించినట్లు చెప్పారు. సినిమా తెరకెక్కించాలన్నది తన 17 ఏళ్ల కల అని చెప్పారు. కేవలం 60 రోజుల్లో నేపథ్య సంగీతం అందించినట్లు చెప్పారు. ఎఫెక్ట్స్‌ కోసం చాలా శ్రమించినట్లు తెలిపారు. యూనిట్‌ సభ్యులు అంకిత భావంతో ఈ చిత్రానికి పని చేసినట్లు చెప్పారు.  ఆడియో ఆవిష్కరిస్తున్న
తెర్కత్తి వీరన్‌ చిత్ర యూనిట్‌ 

మరిన్ని వార్తలు