Actor Soori : కోలీవుడ్‌లో సంచలనం.. నటుడి హోటల్‌లో రైడ్స్‌

22 Sep, 2022 10:15 IST|Sakshi

తమిళసినిమా: మదురైలోని నటుడు సూరి హోటళ్లలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. హాస్యపాత్రలు చేసే స్థాయి నుంచి కథానాయకుడిగా ఎదిగిన నటుడు సరి. ఈయన మదురైలో పలు ప్రాంతాలలో సొంతంగా అమ్మన్‌ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇతర హోటళ్ల కంటే వినియోగదారులకు సూరి తక్కువ ధరకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తున్నారనే పేరు ఉంది.

ఇదే ఆయన అమ్మన్‌ హోటళ్లపై వాణిజ్య శాఖ అధికారుల తనిఖీలకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని ఇతర హోటల్లో నిర్వాహకుల ఫిర్యాదుల కారణంగా మంగళవారం సాయంత్రం అధికారులు నటుడు సరి హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఆ హోటల్లో వినియోగిస్తున్న ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్న సరుకుల గురించిన వివరాలు సేకరించారు.

హోటల్‌లో విక్రయిస్తున్న ధరల పట్టికలను తనిఖీ చేయగా అందులో జీఎస్టీ పన్ను చెల్లించడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కాగా నటుడు సూరి హోటళ్లపై తనిఖీల ఘటన కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది. 

మరిన్ని వార్తలు