మరో విషాదం : కమెడియన్‌ కన్నుమూత

24 Nov, 2020 12:48 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ హాస్య నటుడు తవాసి (60) కన్నుమూశారు. మధురై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం  (నవంబర్ 23) సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతున్న తవాసి ఎమోషనల్ వీడియో ఇటీవల వైరల్‌ అయింది. దీంతో ఆయన కోలుకోవాలంటూ స్పందించిన పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.  త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయినా ఆరోగ్యం పూర్తిగా విషమించి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తవాసి మృతికి కోలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు

కాగా తవాసి అనారోగ్యం, ఆర్థికపరిస్థితిపై ఆయన కుమారుడు తన తండ్రి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆర్థిక సాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్‌ నటులు విజయ సేతుపతి, సూరి, శివకార్తికేయన్‌, సౌందరరాజా, శింబు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు. సుందర్‌పాండియన్, వరుతాపాదా వాలిబార్ సంగం, రజిని మురుగన్ తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో తనదైన నటనతో అలరించారు. తవాసి. ఆయన నటించిన చివరి చిత్రం రజనీకాంత్ హీరోగా రూపొందింన అన్నాట్టే విడుదల కావాల్సి ఉంది. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు