ఇండియాలోనే అత్యధిక పారితోషికం.. వారీసు మూవీతో విజయ్ రికార్డ్..!

10 Jan, 2023 19:56 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్‌ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా  తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. 

(ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం)

విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్‌సీస్‍లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు.

వారిసు సినిమా త‌మిళంలో జ‌న‌వ‌రి 11న, హిందీలో జ‌న‌వ‌రి 13న, తెలుగులో సంక్రాంతి స్పెష‌ల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత  ప్రధాన పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు