మరో విషాదం: కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

29 May, 2021 10:11 IST|Sakshi

తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్‌ సుభా శనివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌ పరీక్షించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మే 29(శనివారం) తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తకు కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

అలాగే వెంకట్‌ సుభా మృతి బాధాకరం అంటు నటి రాధిక శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌లతో పాటు పలువురు నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా వెంకట్ సుభా ‘మొజి, అఘగియా తీయే, కందనాల్ ముధల్’ వంటి చిత్రాలకు పనిచేశారు. అంతేగాక పలు తమిళ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. ఇక టూరింగ్ టాకీస్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆయన సినిమా రివ్యూయర్‌గా వ్యవహరించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు