నటి రేష్మా మృతి

23 Jun, 2021 07:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటి రేష్మా అలియాస్‌ శాంతి(42) శ్వాస సంబంధిత సమస్యతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్‌ అని, ఆ తదుపరి నెగెటివ్‌గా భిన్న ఫలితాలు వచ్చాయి.

అయితే ఆమెకు శ్వాస సమస్య తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. కాగా కార్తీక్‌ హీరోగా తెరకెక్కిన 'కిళక్కు ముగం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రేష్మా పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ కుమారుడు హంసవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకున్నారు. వీరికిద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

చదవండి: రంగంలోకి సాయి ధరమ్‌తేజ్‌.. రిపబ్లిక్‌ డబ్బింగ్‌ షురూ..

మరిన్ని వార్తలు