కోరిక తీరిస్తే ఎంత డబ్బైనా ఇస్తానంటూ నటికి లెక్చరర్‌ వేధింపులు

15 May, 2021 20:28 IST|Sakshi

సోషల్‌ మీడియాలో హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు. ఎన్ని సార్లు బ్లాక్‌ చేసినా ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి మరీ తమ సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. బాడీ షేమింగ్‌ చేస్తూ అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషిస్తారు. ఇలాంటి వాటిని కనీసం పట్టించుకోకుండా లైట్‌ తీసుకునేవాళ్లు కొందరైతే, మరికొందరు మాత్రం వాళ్లకు బుద్ది వచ్చేలా గట్టి సమాధానమే ఇస్తారు. తాజాగా కోలీవుడ్‌ నటి సౌందర్య నందకుమార్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనను తాను లెక్చరర్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టాడు. తనతో ఓ రాత్రి గడపాలని ఇందుకోసం ఎంత డబ్బు అడిగినా ఇస్తానంటూ తన నీచత్వాన్ని బయటపెట్టాడు.


ఇది చూసిన సౌందర్య అతడికి స్ర్టాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. సదరు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నెట్టింట రివీల్‌ చేసింది. అతడిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కటకటాల పాటు చేస్తానని గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఎలా అయినా అతడికి బుద్ది చెబుతానని పేర్కొంది. ఈ సందర్భంగా కాలేజీలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నీచమైన వ్యక్తులు కూడా లెక్చరర్‌ రూపంలో ఉంటారని హెచ్చరించింది. ఇక సింగర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన సౌందర్య ఆ తర్వాత పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, టీవీ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని ప్రదర్శించుకుంది. తాజాగా విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమాలోనూ ప్రముఖ పాత్ర పోషించింది. 


చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..
బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు