పా.. పా వస్తోంది

23 Sep, 2023 04:34 IST|Sakshi

కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వీటీవీ గణేష్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దా... దా...’. గణేష్‌ కె. బాబు దర్శకత్వం వహించారు. ఎస్‌. అంబేత్‌ కుమార్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో హిట్‌ అయింది. ఈ సినిమా ‘పా... పా...’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నీరజ సమర్పణలో పాన్‌ ఇండియా మూవీస్, జేకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఎంఎస్‌ రెడ్డి తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

‘‘యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘పా... పా...’. త్వరలో ట్రైలర్‌ విడుదల చేయనున్నాం. కొత్త తరహా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ‘పా...పా...’ని కూడా హిట్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంఎస్‌ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: కె. ఎళిల్‌ అరసు, సంగీతం: జెన్‌ మార్టిన్, సహనిర్మాతలు: శ్రీకాంత్‌ నూనెపల్లి, శశాంక్‌ చెన్నూరు.

మరిన్ని వార్తలు