సినీ దర్శకుడు కన్నుమూత

18 Sep, 2020 09:57 IST|Sakshi

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో మరో మరణం చోటు చేసుకుంది. కరోనా తదితర సమస్యల కారణంగా ఇప్పటికే పరిశ్రమ పలువురు సినీ ప్రముఖులను కోల్పోయింది. తాజాగా దర్శకుడు బాబు శివన్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన వయసు 54 ఏళ్లు. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘వేట్టైక్కారన్’‌  చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే విజయ్‌ హీరోగా ఏవీఎం సంస్థ  నిర్మించిన ‘కురివి’ చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై  దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. కాలేయం, ఊపిరితిత్తులు  సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్‌ వైద్యం ఫలించక బుధవారం రాత్రి తుదిశ్వాస  విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్‌ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి  గురైంది.  ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. (చదవండి: లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు