వాస్తవ ఘటన ఆధారంగా ‘కంపెనీ’

12 Jan, 2022 09:34 IST|Sakshi

వాస్తవ ఘటన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం కంపెనీ. గోలిసోడా చిత్రం ఫేమ్‌ పాండీ, మురుగేశన్, నవ నటుడు టిరీష్‌ కుమార్, పృథ్వీ కథానాయకులుగాను, నటి వలిన, గాయత్రి నాయికలుగా నటిస్తున్నారు. ఎస్‌.రంగరాజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ మహానంద సినిమాస్‌ పతాకంపై ఆర్‌.మురుగేశన్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కరూర్‌ జిల్లాలోని బస్సుల తయారీ  కర్మాగారంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిందన్నారు.

అందులో పని చేసే నలుగురు యువకులు తమ లక్ష్యం కోసం పాటుబడ్డారన్నారు. ఆ సమయంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? వంటి పలు ఆసక్తికరమైన విషయాలతో యాక్షన్‌ డ్రామా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ కరూర్‌ జిల్లాలోని బస్సుల తయారీ కర్మాగారంలోనే చేపట్టినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. దీనికి సెంథిల్‌కుమార్‌ ఛాయాగ్రహణం, జుపిన్‌ సంగీతాన్ని  అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు