Vishal: ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు. ఎవరనేది అప్పుడే చెబుతా..!

8 Nov, 2022 15:17 IST|Sakshi

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. గతంలో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విశాల్ ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతని పెళ్లి విషయంలో పలు రకాల రూమర్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఈయనకు హైదరాబాద్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం అనివార్య కారణాలతో ఆగిపోయింది. 

(చదవండి: విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?)

ప్రస్తుతం విశాల్‌ నటనపైనే పూర్తి దృష్టి సారించిన హీరో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ ఆరో తేదీన ఓ ఛారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 11 పేద జంటలకు సంబంధించిన పెళ్లి ఖర్చులను ఆయనే భరించాడు. వారికి తాళిబొట్టుతో పాటు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు.  అనంతరం విశాల్ మాట్లాడుతూ..'అరేంజ్‌డ్ మ్యారేజ్ నాకు సెట్ కాదు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా. నేను ప్రేమించిన అమ్మాయిని అతి త్వరలోనే పరిచయం చేస్తా. తనకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది.' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నామని విశాల్ వెల్లడించారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.ఈ భవన నిర్మాణం పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుంటానని విశాల్ స్పష్టం చేశారు. విశాల్ ప్రేమించిన అమ్మాయి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతో విశాల్ అభిమానులు త్వరలోనే సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


.


 

మరిన్ని వార్తలు