దూరమైన ప్రేమజంట మళ్లీ కలుస్తుందా? పరువు కాదల్‌ త్వరలో

23 Apr, 2022 09:54 IST|Sakshi

పరువు కాదల్‌ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్‌ ఫిలిం ప్రొడక్షన్‌ పతాకంపై న్యాయవాది అల్విన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎస్‌.రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాళింగరాయన్, సల్మిత హీరో హీరోయిన్లుగా నటించిన ఇందులో ఆర్‌.సుందరరాజన్‌ ముఖ్యపాత్ర పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో గాఢంగా ప్రేమించుకున్న జంట అనుకోకుండా దూరం కావాల్సి వస్తుందన్నారు. ఆ తరువాత యువకుడు తన ప్రేయసిని కలుసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ప్రేమ, వినోదం కలగలిపిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. హోసూర్, పెరంబలూర్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేసినట్లు చెప్పారు. దీనికి తంజై అరుణ్‌ప్రసాద్‌ సంగీతాన్ని, టి.మహిబాలన్‌ చాయాగ్రహణం అందించారు.

చదవండి 👉 హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు, హృదయం ముక్కలైంది

సినీ నటి జీవితకు అరెస్ట్‌ వారెంట్‌

మరిన్ని వార్తలు