మరో విషాదం: ప్రముఖ దర్శక-నిర్మాత మృతి

27 Apr, 2021 18:15 IST|Sakshi

ప్రముఖ నటుడు, కమెడియన్‌ వివేక్‌ మృతి మరువకముందే తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమీరా(53) మంగళవారం కరోనాతో కన్నుముశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

20 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలో ఓ ఆస్పత్రిలో చేరారు.అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికి ఆయన ఆరోగ్యం రోజుకు రోజుకు మరింత క్షీణించడంతో ఆస్పత్రిలోనే నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. 

కాగా తమిళంలో ఆయన పలు సినిమాలకు నిర్మాత వ్యహరించారు. 2010లో రెట్టైసుజి అనే మూవీతో నిర్మాత సినీ పరిశ్రమలోకి అరంగ్రేట్రం చేశారు. ఆయనకు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. తమీరా దర్శకుడు కె బాలచందర్, భారతీరాజా వంటి దిగ్గజ దర్శకులు వద్ద పనిచేశారు. ఆయన మొదటి సారిగా తెరకెక్కించిన రెట్టైసుజి మూవీ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్‌ చేసింది.

చదవండి: 
నాని మూవీకి హ్యాండ్‌ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్‌ వాయిదా! 
Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్‌, హీరోగా బండ్ల గణేశ్‌

మరిన్ని వార్తలు