Karthi Sardar Movie Looks: సర్దార్‌లో అన్ని గెటప్పులా.. అలా అయితే సూర్యను దాటేసినట్లే..!

19 Oct, 2022 21:15 IST|Sakshi

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పటివరకు సూర్యను అధిగమించనున్నాడు. ఇంతకుముందు వీడొక్కడే సినిమాలో ఓ పాటకోసం పది రూపాల్లో కనిపించాడు సూర్య. 

(చదవండి: రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి)

అయితే ఈ గెటప్స్‌ పాట కోసమా, సినిమాలో భాగంగా వేశాడా అన్న విషయం రిలీజైన తర్వాతే క్లారిటీ రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా  తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అతనికి జంటగా రాశిఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించగా.. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళం, తెలుగులో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ విడుదల చేస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పీఎస్ మిత్ర‌న్ వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌,ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 21న విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు