సినీ సాహసి.. ఘట్టమనేని

16 Nov, 2022 09:48 IST|Sakshi

చెన్నైతో సూపర్‌స్టార్‌ కృష్ణకు  ఎనలేని అనుబంధం 

సంతాపం వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్, సినీ ప్రముఖులు  

సినీ సాహసి ఘట్టమనేని కృష్ణ.. అద్వీతీయ నటనతో 350కి పైగా చిత్రాలు చేసిన నటుడు. ఇన్ని చిత్రాలు చేసిన హీరో మరొకరు తెలుగు సినీ పరిశ్రమలోనే లేరు. కృష్ణ సినీ కళామతల్లి ఒడిలో ఎదిగింది చెన్నైలోనే. ఈయన కోడంబాక్కం ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఆయన ఎదుగుదల, వెలుగుకు చెన్నైనే చిరునామా. కృష్ణ సాహసాలు చేసింది. సూపర్‌ స్టార్‌ అయ్యింది ఇక్కడే. పద్మాలయ ఫిలిమ్స్‌ సంస్థను ప్రారంభించింది, నిర్మాతగా మారింది, దర్శకుడిగా అవతారం ఎత్తింది చెన్నపురిలోనే. ఇక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ సంబంధించిన మధుర స్మతులు ఎన్నో ఎన్నెన్నో. లెజెండరీ హీరో కృష్ణ ని్రష్కమణతో టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.  

కొత్తదనాన్ని పరిచయం చేసిన నటుడు: సీఎం 
తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ మరణ వార్త తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కృష్ణ కుమారుడు నటుడు మహేశ్‌ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటుడు రజినీకాంత్‌ స్పందిస్తూ, తాను ఎప్పటికీ అభిమానించే నటుడు కృష్ణ అని, ఆయనతో కలిసి మూడు హిట్‌ చిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి పేర్కొంటూ గొప్ప కీర్తిని సంపాదించుకున్న సేవాతత్పరుడు, గట్స్‌ ఉన్న మనిషి, వివాదరహితుడు, గౌరవ ప్రదమైన వ్యక్తి అయిన కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యుసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ ఆయన వద్ద 22 చిత్రాలకు  తాను కో– డైరక్టర్‌గా పని చేసి ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేశారు. హాస్య నటుడు సెంథిల్‌ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. విశ్వనటుడు కమలహాసన్‌ పేర్కొంటూ, తెలుగు సినీ వినీలాకాశంలో ఉన్నతస్థాయికి ఎదిగిన నటుడు కృష్ణ అని వ్యాఖ్యానించారు. ఏడాది వ్యావధిలో తల్లి, సోదరుడు, తండ్రిని వరుసగా కోల్పోయిన నటుడు మహే‹Ùబాబు కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. నటుడు, డీఎండీకే నేత విజయకాంత్‌ పేర్కొంటూ.. కృష్ణ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల తరపున ఆ సంఘం అధ్యక్షుడు నాజర్‌ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు.  
 

మరిన్ని వార్తలు