Vishal: వైఎస్‌ జగన్‌ అంటే అభిమానం: తమిళ స్టార్‌ విశాల్‌

20 Dec, 2022 10:59 IST|Sakshi

సాక్షి, తిరుచానూరు (తిరుపతి జిల్లా): రాజకీయ నేతల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే తనకు అభిమానమని తమిళ సినిమా స్టార్‌ విశాల్‌ తెలిపారు. లాఠీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో విశాల్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తిరుç­³తి ఎస్‌డీహెచ్‌ఆర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి సీనియర్‌ నటుడు మంచు మోహ­న్‌­బాబు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్‌ పలు ఆసక్తికర విషయాలను వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో ఎవరంటే ఇష్టమని అడిగిన విద్యార్థికి తనకు జగన్‌ అంటే అభిమానమన్నారు. కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని, అయితే అక్కడ నుంచి తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా­సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదన్నారు. సిని­మాల్లో తాను సంతోషంగా ఉన్నానని తెలిపా­రు. మోహన్‌బాబు మాట్లాడుతూ తాను హీరో­గా నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాకు విశాల్‌ తండ్రి నిర్మాత అని, ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్న అనుబంధంతోనే లాఠీ ప్రమోషన్‌ ఫంక్షన్‌కు వచ్చినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు