ప్రభాస్‌ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా.. తమిళ స్టార్ హీరో కామెంట్స్ వైరల్

14 Dec, 2022 21:26 IST|Sakshi

తమిళ స్టార్ హీరో, నిర్మాత విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లిపై ఇదివరకే ఓ క్లారిటీ ఇచ్చిన నటుడు టాలీవుడ్‌ హీరోపై క్రేజీ కామెంట్స్ చేశారు. ఇంతకుముందు చెన్నైలో నిర్మిస్తున్న నడిగర్ సంఘం భవనం పూర్తయిన వెంటనే వివాహం చేసుకుంటానని ప్రకటించారు. తాజాగా  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న తర్వాతే తాను వివాహం చేసుకుంటానని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన స్పందించారు. 

విశాల్ మాట్లాడుతూ.. 'వివాహం అంటే ఓ బాధ్యత. పెళ్లి చేసుకోవాలని ఉన్నా ప్రస్తుతానికి నా ఫోకస్‌ వర్క్‌ పైనే ఉంది. నటుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. వృత్తిపరంగా ఎంత నిబద్ధతగా ఉన్నానో.. వ్యక్తిగత జీవితంలోనూ అలాగే ఉండాలి కదా.' అని తెలిపారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా..  ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఆయన సరదాగా బదులిచ్చారు. విశాల్ ప్రస్తుతం లాఠీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గతంలో తన కోస్టార్‌ అభినయతో ఆయన ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల వరుస కథనాలు దర్శనమిచ్చాయి. 

మరిన్ని వార్తలు