అవార్డుల వేడుకలో తారల సందడి.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

6 Dec, 2021 10:48 IST|Sakshi

చెన్నై సినిమా: చెన్నైలో జరిగిన అవార్డుల వేడుకలో తారలు సందడి చేశారు. మహా ఆర్ట్స్‌ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ అనురాధ, యునైటెడ్స్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల నిర్వాహకుడు కలైమామణి, డాక్టర్‌ నెల్‌లై సుందరరాజన్‌ కలిసి నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో విశ్రాంత హైకోర్టు న్యాయమూ ర్తి ఎస్‌.కె.కృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించా యి. అనంతరం పలువురు నటీనటులకు ప్రోత్సాహక అవార్డులను విశ్రాంత న్యాయమూర్తి ప్రదానం చేసి సత్కరించారు. అవార్డులను అందుకున్న వారిలో సినీ నటి జ్యోతిమీనా, మేఘన ఎలెన్, రోజా, మాలిని తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు