విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ తథ్యం.. సేవా కార్యక్రమాలు విస్తృతం

26 Aug, 2022 16:44 IST|Sakshi

నటుడు విజయ్‌ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనిపిస్తోంది. చాలాకాలం క్రితమే ఈయన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కూడా విజయ్‌ అభిమానులతో సమావేశాలు నిర్వహించి మరింత జోష్‌ తెచ్చారు. అయితే కారణాలు ఏమైనా అప్పట్లో వెనుకంజ వేశారు.

ప్రస్తుతం అగ్ర నటుడిగా రాణిస్తున్న విజయ్‌ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోపక్క అభిమానులను ప్రజల అవసరాలను గ్రహించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో విజయ్‌ మక్కళ్‌ ఇయక్కమ్‌ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు.

అలాగే ప్రతి ఆదివారం పుదుచ్చేరిలో తనే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు పదవుల కోసం పరుగులు తీస్తుంటే విజయ్‌ మక్కళ్‌ ఇయక్కం నిర్వాహకులు ప్రజల మధ్యకు వెళ్తూ వారి అవసరాలను తీర్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు