కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్‌ మాదిరిగానే

24 May, 2021 04:00 IST|Sakshi

నెటిజన్లపై నటి వనిత మండిపాటు 

తమిళసినిమా: సంచలన నటి వనిత విజయకుమార్‌ పేరు మరోసారి సామాజిక మాధ్యమాల్లో నానుతోంది. నిజానికి నెటిజన్లే ఆమెపై సెటైర్లు వేస్తూ ఆగ్రహానికి గురి చేస్తున్నారని చెప్పవచ్చు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో ప్రజలు దాని బారిన పడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపేస్తున్న పరిస్థితి. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కోవైలో కొందరు ఒక అడుగు ముందుకు వేసి కరోనా దేవి పేరుతో ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. కరోనా నుంచి త్వరగా తమను బయటపడేయాలని మొక్కుతున్నారు. ఈ వ్యవహారంలోకి నటి వనిత విజయకుమార్‌ను లాగేశారు కొందరు నెటిజన్లు. కరోనా దేవి ప్రతిమ అచ్చం నటి వనిత విజయకుమార్‌ మాదిరిగానే ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా దీనికి సంబంధించిన మీమ్స్‌ను ఆమెకే పోస్టు చేస్తున్నారు. ఇది చూసిన వనిత విజయకుమార్‌ నెటిజన్లపై మండిపడుతున్నారు.  

మరిన్ని వార్తలు