Tammareddy Bharadwaj: కొనుక్కున్నవాడిదే తప్పు, డబ్బులెందుకివ్వాలి?

26 Oct, 2022 20:33 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్‌ సినిమా ఫ్లాప్‌ పూరీ జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్‌ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌ మాత్రం పూరీ ఆఫీస్‌ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్‌ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్‌ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్‌ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్‌ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్‌ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్‌ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా?
అమ్మ ఆరోగ్యానికి రిస్క్‌ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు

మరిన్ని వార్తలు