Tammareddy Bharadwaja: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి

11 Mar, 2023 09:12 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆస్కార్‌ బరిలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆస్కార్‌ అవార్డు కోసం ట్రిపుల్‌ ఆర్‌ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందంటూ షాకింగ్‌ కామెంట్స్. దీంతో ఆయనపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

చదవండి: దిల్‌ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో..

ఇక తనపై వస్తున్న నెగిటివిటీ చూసి తమ్మారెడ్డి నేరుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనన్నారు. తాను చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే కేవలం ఓ క్లిప్పింగ్‌ ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి ఈర్ష్యతో అలా అన్నానని కొందరు అంటున్నారని, ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ కౌంటర్‌ ఇచ్చారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదే? అని ప్రశ్నించారు. 

‘నేను ఇండస్ట్రీకి వివరణ ఇచ్చుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. కానీ పెద్దవాళ్లు అందరు మాట్లాడాకా నేను దానికి సమాధానం కూడా చెప్పనక్కర్లేదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం

‘కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైన నేను నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్నా మీకు నన్ను అనే హక్కు ఉందా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడాను అది చూడలేదా? ఇప్పుడు ఎవరో ఏదో క్లిప్‌ పెట్టేసరికి మీకు తెలిసిందా? మూడు గంటల చిన్న సినిమా గురించి మాట్లాడాను. మీరు ఓ చిన్న సినిమా కోసం టైం కెటాయించగలరా? ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలా? అని చూసే మీరా నా గురించి మాట్లాడేది. నన్ను అనే హక్కు మీకుందా? ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుంది’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. 

మరిన్ని వార్తలు