Vishwak Sen-Arjun Sarja: ‘ఈ యంగ్‌ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి’

8 Nov, 2022 09:21 IST|Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా-యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వక్‌ సేన్‌ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్‌ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్‌ ఆరోపణలపై విశ్వక్‌ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 

చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు.  సినిమా షూటింగ్‌ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు.

విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్‌ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్‌ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్  హిట్లు ఇచ్చారు.  ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు.

చదవండి: ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్‌.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్‌ రామ్‌

కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్‌లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఒక్క విశ్వక్‌ సేన్‌ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్‌ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు