నీకు నువ్వే ఆయుధమవ్వాలి: తనికెళ్ళ భరణి

2 Aug, 2021 08:59 IST|Sakshi
మాట్లాడుతున్న సినీ రచయిత తనికెళ్ళ భరణి   

సాక్షి, మాదాపూర్‌: అమ్మగా, చెల్లిగా, అక్కలా, ఆలిగా ఇలా మహిళ నిత్యం ఎన్నో పాత్రలు పోషించినా నేటికీ ఆమె బానిసత్వంలోనే ఉండిపోతోంది. మహిళ గొప్పదనాన్ని తెలుపుతూ మాదాపూర్‌ శిల్పారామంలో గోగ్రహణం పేరిట ఆదివారం వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా రచయిత తనికెళ్ళ భరణి హాజరై నాటకాన్ని ప్రారంభించారు. నిజజీవితంలో స్త్రీ ఎన్నో పాత్రలు పోషించినా బానిసత్వం ఆమెను చేతగాకుండా చేస్తోందన్నారు. అబలవంటూ చట్టాలు, న్యాయాలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానమై, ఆత్మవిశ్వాసం నిండిన ఆదిశక్తివై నీకు నువ్వే ఆయుధం అవ్వాలనే సందేశానిస్తూ గోగ్రహణం నాటికను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు